బుల్లితెర క్వీన్ అంటే ఎవరంటే ఎలాంటి డౌట్ లేకుండా ఫస్ట్ వినిపించే పేరు సుమ. యాంకరింగ్ తోనే బుల్లితెరపై రాణిస్తూ.. యాంకరింగ్ లో తనకు ఎవరూ సాటిలేరు అన్న రేంజ్ కు ఎదిగింది. దాదాపుగా ఏ సినిమా ఫంక్షన్ అయినా సరే మనకు ముందుగా సుమనే కనిపిస్తుంది. సెలబ్రిటీలు కూడా సుమనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఇక బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సుమ చాలా ఏళ్ల తరువాత మళ్లీ వెండితెరపై పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్రలో కనిపించి అలరించింది. జయమ్మ పంచాయితీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మే 6వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా రిజల్ట్ పక్కన పెడితే సుమ నటనకు మాత్రం మంచి ప్రశంసలే దక్కాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఓటీటీలోకి కూడా వచ్చేస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఈసినిమా సందడి చేయనుంది. తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. జూన్ 14వ తేదీన ఈసినిమా అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్లలో చూడని వాళ్లు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
We already know Jayamma won all our hearts!! ❤️
This time she is back to entertain us again with the emotional drama #JayammaPanchayathi streaming on @PrimeVideoIN from June 14th! 😍@ItsSumaKanakala @mmkeeravaani @VijayKalivarapu @PrakashBalaga @vennelacreation #TeluguFilmNagar pic.twitter.com/w8tsegjUc0— Telugu FilmNagar (@telugufilmnagar) June 11, 2022
కాగా విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కింది. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించిన ఈసినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. అనూష్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: