యంగ్ హీరో నిఖిల్ కూడా మంచి స్పీడు పెంచాడు. ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ను ఒకదాని తర్వాత ఒకటి పూర్తిచేసే పనిలో పడ్డాడు. ఇక వాటిలో స్పై సినిమా కూడా ఒకటి. గారీ బి.హెచ్ దర్శకత్వంలో స్పై అనే యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి ఇంట్రడక్షన్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. గ్లింప్స్ లో నిఖిల్ చేతిలో ట్రాన్స్‌మీటర్‌తో మంచు పర్వతాల మీద నడుస్తూ ఆయుధాలతో ఉన్న ఓ ప్రదేశాన్ని మంచులో కనుక్కొని అందులోంచి గన్స్ తీసుకొని నిఖిల్ బైక్ నడుపుతూ శత్రువులను కాల్చిచంపడం చూపించారు. దీంతో ఈసినిమా ఫుల్ యాక్షన్ మోడ్ తో ఉన్నట్టు తెలుస్తుంది.. ఈ గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు పెంచేశాడు నిఖిల్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆర్యన్ రాజేష్ కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా.. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నాడు. దర్శకత్వంతో పాటు గారీ ఈసినిమాకు ఎడిటర్ గా కూడా వ్యవహరించనున్నాడు. ఇంకా ఈసినిమాను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో రూపొందించనున్నారు.
A Thrilling Action Extravaganza Across Continents🔥🔍
Presenting, The INTRO GLIMPSE of @actor_Nikhil‘s #SPY
▶️ https://t.co/ynykZRtl2vస్పై – स्पै – ஸ்பை – ಸ್ಪೈ – സ്പൈ@Ishmenon @Garrybh88 @tej_uppalapati @SricharanPakala #EDEntertainments #KRajashekarreddy#Nikhil_SPY
— Nikhil Siddhartha (@actor_Nikhil) June 6, 2022
ఇక ఈసినిమాలతో పాటు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ 18 పేజీస్ సినిమా చేస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై రానున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్న ఈసినిమాకు.. సుకుమార్ రైటింగ్స్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమాతో పాటు నిఖిల్ చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: