ఎన్ని సినిమాలు చేశాం అన్నది కాదు.. తమ పాత్రల ద్వారా ప్రేక్షకులకు ఎంత గుర్తుండిపోయేలా చేశాం అన్నది చూస్తారు కొంతమంది నటీనటులు. అలాంటి వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో అడివి శేష్ ముందు ప్లేస్ లో ఉంటాడు. కెరీర్ ఆరంభం నుంచి విభిన్న చిత్రాలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు అడివి శేష్. ఇక ఇప్పుడు మరోసారి తనేంటో నిరూపించాడు. కిరణ్ తిక్కా దర్శకత్వంలో అడివి శేష్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా మేజర్. మేజర్ దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఓ సైనికుడి కథ. 26\ 11ముంబై దాడుదల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణణ్ జీవిత ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. అందుకే ఈసినిమాకు ప్రతి ఒక్కరూ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు. మరోసారి ప్రతి ఒక్కరిలో ఉన్న దేశభక్తిని తట్టిలేపాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా చూసి సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికదా చిత్రయూనిట్ ను అభినందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే అల్లు అర్జున్ కూడా మేజర్ ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకునేలా సినిమా ఉందని, డైరెక్టర్, హీరో, కాస్ట్ అండ్ క్రూ అందరినీ ప్రశంసించారు. అంతేకాదు ఇలాంటి సినిమాను తీసినందుకు మహేష్ కు స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాడు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ ట్వీట్ కు మహేష్ బాబు కూడా స్పందించి రిప్లై ఇచ్చాడు. ‘థ్యాంక్స్ అల్లు అర్జున్. మీ మాటలు మేజర్ టీమ్‌కు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ‘మేజర్’ మూవీ మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది’అని మహేష్ ట్వీట్ చేశాడు.
Thank you @alluarjun! Your words will surely encourage the young team of #Major. Happy to know that you loved the film ♥️ https://t.co/UVLHEQygcg
— Mahesh Babu (@urstrulyMahesh) June 5, 2022
కాగా జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్, ఏ ప్లస్ ఏస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈసినిమాను నిర్మించారు. అడివి శేష్ సరసన సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించగా.. శోభిత ధూళిపాళ మరో కీలక పాత్ర నటించింది. ప్రకాశ్ రాజ్, రేవతి, మురళీ శర్మ ఇతర కీలక పాత్రలు పోషించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: