తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం నాగార్జున హీరోగా తెరకెక్కించిన ఒకే ఒక తెలుగు మూవీ “గీతాంజలి “ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. మణిరత్నం ప్రస్తుతం రాజ రాజ చోళన్ జీవిత చరిత్ర ఆధారంగా భారీ బడ్జెట్ ,భారీ తారాగణం తో “పొన్నియిన్ సెల్వన్ “తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“బాహుబలి “, “ఆర్ ఆర్ ఆర్ “, “పుష్ప :ది రైజ్ “, “కె జి ఎఫ్ చాప్టర్ 2 ” మూవీస్ అన్ని భాషలలోను సక్సెస్ అయిన విషయం తెలిసిందే.బాలీవుడ్ ని మించిన గొప్ప సినిమాలు చేసే దమ్ము సౌత్ పరిశ్రమలకు ఉందని సౌత్ మేకర్స్ నిరూపించారని మణిరత్నం చెప్పారు.సౌత్ సినిమా గురించి.. అందులోనూ కన్నడ , తెలుగు సినిమాల గురించి లెజెండరీ దర్శకుడు మణిరత్నం సంచలన వ్యాఖ్యలు చేసారు. సౌత్ సినిమా గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేసారు. హాలీవుడ్ సినిమాలు తమిళ భాష లో మంచి విజయం సాధిస్తున్నాయనీ , అలాంటప్పుడు కన్నడ..తెలుగు సినిమాలు మన దగ్గర విజయం సాధిస్తే తప్పేముంది అంటూ కామెంట్ చేశారు.దక్షిణాది సినిమాల ఫరిది ఇప్పుడు పెరిగిందనీ , ఇతర భాషల సినిమాల్ని చూసి భయపడాల్సిన పనిలేదనీ , తమిళ పరిశ్రమ ఎప్పుడూ ఇతర పరిశ్రమలకి పోటీగా ఉంటుందనీ , అందులో ఎలాంటి సందేహం లేదనీ , పోటీ అనేది ఆరోగ్యకరంగా ఉండాలనీ , తెలుగు, కన్నడ భాషల విజయాల్ని ఎవరూ ఆపలేరనీ , కొత్త మేకర్స్ తెరపై వండర్స్ సృష్టిస్తున్నారనీ , మరిన్ని వండర్స్ చేయగల సత్తా ఉన్నవాళ్లని ప్రోత్సహించాలనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: