ప్రస్తుతం తమిళ్ నటులకు తెలుగు సినిమాల్లో మంచి డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. అందులో సముద్రఖని ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు. కోలీవుడ్ లో దర్శకుడిగా, రచయితగా, నటుడిగా మంచి పేరును సంపాదించుకున్నాడు సముద్రఖని. రఘువరన్ బీటెక్ సినిమాలో ధనుష్ తండ్రిగా నటించి తన సహజ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమాతో తెలుగులో కూడా మంచి అవకాశాలు దక్కించుకున్నాడు. అల వైకుంఠపురములో, క్రాక్ , ఆర్ఆర్ఆర్ సినిమాలు రిలీజ్ అవ్వగా.. ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలతో బిజీబిజీగా గడుపుతున్నాడు సముద్రఖని.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నేడు సముద్రఖని తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈసందర్భంగా తను నటిస్తున్న సినిమాల నుండి బర్త్ డే విషెస్ అందిస్తున్నారు. ఈనేపథ్యంలోనే దొంగలున్నారు జాగ్రత్త టీమ్ కూడా సముద్రఖనికి బర్త్ డే విషెస్ అందించారు.
Team #DongalunnaruJaagratha wishes Samuthirakani garu a very happy birthday! @thondankani#DLJ @simhakoduri23#PreethiAsrani @SathishTripura @kaalabhairava7@sureshprodns@gurufilms1 @manzarstudios @yeshhu92 @garrybh88 @SBDaggubati @SunithaTati pic.twitter.com/seD1bXaiS9
— gurufilms (@gurufilms1) April 26, 2022
కాగా సతీష్ త్రిపుర దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు సతీష్. అయితే చాలా రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటికీ.. కరోనా కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇటీవలే ఈసినిమా షూటింగ్ మళ్లీ స్టార్ట్ చేశారు. ప్రీతి ఆస్రాని హీరోయిన్గా నటిస్తున్న ఈసినిమాను సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రోహిత్ కులకర్ణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. యశ్వంత్ సి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























