సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి , రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ రిలీజ్ కానుంది.మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో “గాడ్ ఫాదర్ “, మెహెర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్ “, బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం లో “చిరంజీవి 154 “మూవీ సెట్స్ పైన ఉన్నాయి. చిరంజీవి ఒకే సారి ఈ మూడు సినిమాలలో నటించడం విశేషం. ఈ మూవీస్ కాకుండా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక మూవీ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక ఇంటర్వ్యూ లో చిరంజీవి మాట్లాడుతూ .. ఇప్పుడు “ఆచార్య “తో కలిపి తన చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయనే అంతా అనుకుంటున్నారనీ , ఇవి కాకుండా ఇంకో ఐదు సినిమాలు సిద్ధమవుతున్నాయనీ , మేమంతా ఎంతో పుణ్యం చేసుకోబట్టే సినిమా రంగంలోకి వచ్చామనీ , ఇక్కడికి వచ్చి నిలదొక్కుకున్న తర్వాత ఎంత సంతోషిస్తామో, ఈ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోతే అంత బాధ పడతామనీ , కాబట్టి మన స్థానం నిలబెట్టుకోవడం కోసం నిరంతరం కష్టపడాల్సిందేననీ , 24 గంటలూ పని చేసినా తనకు విసుగురాదనీ , తన కష్టమే తనను ఆరోగ్యవంతుడిని చేస్తుందనీ , తాను కష్టపడేంత వరకు ఈ ఇండస్ట్రీ తనను ఎప్పుడూ అక్కున చేర్చుకుంటుందని నమ్ముతాననీ , “గాడ్ ఫాదర్” , చిరంజీవి 154 “మూవీ కి రాత్రుళ్లే షూటింగ్ జరుగుతుందనీ , తనకు ఎక్కడా విసుగు రాలేదనీ , షూటింగ్స్ లో పాల్గొంటున్నప్పుడు మరింత ఉత్సాహం వస్తుందనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: