పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. పీరియాడికల్ స్టోరీ కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నిజానికి ఈసినిమా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది కానీ మధ్యలో భీమ్లానాయక్ ను పూర్తి చేయడంతో ఈసినిమా వెనక్కి వెళ్లిపోయింది. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఓ ప్రత్యేకమైన సెట్ లో పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇప్పటికే యాక్షన్ సీన్స్ కు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ ను గత కొన్ని రోజులుగా దర్శకుడు క్రిష్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా మరో ఫొటోను కూడా షేర్ చేశారు క్రిష్. ఓ సన్నివేశ చిత్రీకరణ అనంతరం పవన్ కళ్యాణ్ మానిటర్ లో సీన్ ను చూసే స్టిల్ ను క్రిష్ పెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
కాగా ఈసినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. అర్జున్ రాంపాల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: