మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆచార్య. ఈసినిమాలో చరణ్ సిద్ద అనే కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిం కదా. దీంతో సినిమాపై మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా ఈనెల 29వ తేదీన భారీ అంచనాల నేపథ్యంలో రిలీజ్ కాబోతుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ రిలీజ్ అవ్వగా అవి సినిమాపై మంచి అంచనాలు పెంచేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈసినిమా ఏప్రిల్ 29వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో టికెట్ల రేటు పెంపుకై తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించగా నేడు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సినిమా టికెట్ల రేటు పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రోజుకు ఏడు షోలు చేసుకునే అవకాశం కల్పించింది. అంతేకాకుండా సినిమా హాళ్లలో ఆయా కేటగిరీలను బట్టి టికెట్ రేట్లను కూడా పెంచుకునేందుకు కూడా సినిమా థియేటర్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఏసీ కేటగిరీలో మాత్రమే ఈ పెంపును ప్రభుత్వం అనుమతించింది. ఈ ధరలను రూ.30 నుంచి రూ.50కి పెంచుకేనేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ టికెట్ల పెంపును కూడా ఏడు రోజుల వరకు మాత్రమే అనుమతించింది.
కాాగా ఈసినిమాలో చరణ్ సరసన పూజా హెగ్డే కనిపించనుంది. నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: