‘బీస్ట్’ టీమ్ కు నెల్సన్ థ్యాంక్స్..!

Director Nelson Thanks Beast Movie Team,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Director Nelson,Director Nelson Latest News,Beast Movie Team,Director Nelson Upcoming Movie News,Director Nelson Next Project Updates,Director Nelson Thanks Beast Team,Director Nelson Sensational Comments On Beast Movie Team

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన సినిమా బీస్ట్. ఇటీవలే ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయింది. అయితే ఈసినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. కొన్నిచోట్ల మాత్రం సాలిడ్ కలెక్షన్సే రాబట్టుకుంది. ఇక ఈసినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా.. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిథి మారన్ ఈసినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా విజయ్ బీస్ట్ టీమ్ కు విందు ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా డైరెక్టర్ నెల్సన్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ టీమ్ అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. థ్యాంక్యూ విజయ్ సర్ ఇలాంటి గుర్తుండిపోయే సాయంత్రాన్ని ఇచ్చినందుకు. ఈ సందర్భంగా మీ ప్రేమ, సపోర్ట్ అందించినందుకు నేను మీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను.. మీతో వర్క్ ఎక్స్ పీరియన్స్ పంచుకున్నందుకు చాలా గొప్పగా ఫీలవుతున్నాను.. మీ ఛరిష్మా, స్టార్ డమ్ ఈ సినిమాను ఈ రేంజ్ కు తీసుకెళ్లింది.. అలానే సన్ పిక్చర్స్ వారికి ఇంకా కాస్ట్ అండ్ క్రూ కి కూడా కృతజ్ఞతలు తెలిపారు.

ఇక నెల్సన్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టాడు. ఇప్పుడు ఏకంగా తలైవా రజినీ కాంత్ తోనే సినిమా చేస్తున్నాడు. మరి ఈక్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − three =