ఇటీవలే ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ ఇప్పుడు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా షూటింగ్ పూర్తి చేశాడు. ఈసినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో పాటు పలు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా మరోవైపు టైగర్ నాగేశ్వరరావు సినిమాను కూడా ప్రారంభించాడు. ఉగాది పండుగ రోజు ఈసినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు చిత్రయూనిట్. అయితే నేడు ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేశారు మేకర్స్ నేడు చిత్ర నిర్మాత అభిషేక్ బర్త్ డే సందర్భాంగా సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. ఈవిషయాన్ని చిత్రయూనిట్ కూడా తమ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
The Most Awaited hunt begins!#TigerNageswaraRao 🐅 shoot begins.
And I Promise all my MASS MAHARAJA @RaviTeja_offl fans on my birthday, this is going to be a MASSive treat for you all.More updates soon ⏳ @DirVamsee @AAArtsOfficial @MayankOfficl pic.twitter.com/ehm4JXhEyo
— Abhishek Agarwal 🇮🇳 (@AbhishekOfficl) April 11, 2022
కాగా వంశీ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాలో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నాడు.
కాగా ఈసినిమాను కూడా నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. 1970 కాలంలో ఇండియన్ రాబిడ్ హుడ్‌గా పిలవబడే గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ అధారంగా తెరకెక్కనుంది. అప్పట్లో నాగేశ్వరరావు ఆంధ్ర ప్రదేశ్‌లో భారీ ఎత్తున దొంగతనాలు, దోపిడీలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే వాడు. మరి ఈసినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: