ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుకు రామ్ చరణ్, కొమురం భీమ్ గా ఎన్టీఆర్ చేసిన నటనకు మంచి ప్రశంసలే దక్కాయి. ఇక ఈసినిమా కలెక్షన్స్ విషయంలో కొత్త రికార్డులే సృష్టిస్తుంది. ఇప్పటికే 1000 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టిన ఇప్పుడు 1500 కోట్ల టార్గెట్ ను అందుకోడానికి పోటీపడుతుంది. ఇక రిలీజ్ కు ముందే ఈసినిమాలో పాటలు ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే. ఇక వాటిలో ముఖ్యంగా నాటు నాటు మాత్రం ఓ రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఈపాటలోని హుక్ స్టెప్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. సామాన్యుల దగ్గర నుండి సెలబ్రిటీల వరకూ అందరూ రీల్స్ చేసి సోషల్ మీడయా వైరల్ గా కూడా చేశారు. ఇక థియేటర్లలో కూడా ఈపాట ఇక ఇదిలా ఉండగా తాజాగా అభిమానులకు మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. తాజాగా నాటు నాటు ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Most Celebrated Dance Number of the Decade #RRRMassAnthem full video song from #RRRMovie is out now! 🕺🕺https://t.co/y46vjv3wx3#NaatuNaatu #NaattuKoothu #NaachoNaacho #HalliNaatu #Karinthol
— DVV Entertainment (@DVVMovies) April 11, 2022
కాగా దాదాపుగా రూ. 450 కోట్ల బడ్జెట్ తో డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించారు. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ నటి అలియా భట్, హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ నటించారు. వీరితో పాటు అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: