డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని, భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా ఎందరో సినీ ప్రముఖులు పొగడ్తల వర్షం కురిపించారు. తాజాగా “ఆర్ ఆర్ ఆర్ “మూవీ పై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు కురిపించారు. పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. “ఆర్.ఆర్.ఆర్” దేశంలోనే అతి పెద్ద సినిమాఅనీ , ఇప్పటి వరకూ రూ. 750 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టిందనీ , . ఇంకా భారీ వసూళ్ళు దక్కించుకుంటుందనీ , ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలాగానే భారత ఆర్ధిక వ్యవస్థ కూడా మోడీ నాయకత్వంలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోందనీ అంటూ సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గోయల్ వ్యాఖ్యలకు “ఆర్.ఆర్.ఆర్” టీమ్ ధన్యవాదాలు తెలియచేసి, దేశ అభివృద్ధిలో భాగమైనందుకు సంతోషిస్తున్నామని కూడా ట్వీట్ చేసింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: