పలు తమిళ , మలయాళ , కన్నడ మూవీస్ లో వరలక్ష్మి శరత్ కుమార్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. “తెనాలి రామకృష్ణ BABL” మూవీ తో వరలక్ష్మి టాలీవుడ్ లో అడుగుపెట్టారు. “క్రాక్ “, “నాంది ” వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన టాలెంటెడ్ యాక్ట్రెస్ వరలక్ష్మి శరత్ కుమార్ టాలీవుడ్ లో పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. వరలక్ష్మి ప్రస్తుతం 5 తమిళ , ఒక కన్నడ, “NBK107 “, “యశోద”, “హనుమాన్ “, “ఆద్య “మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక ఇమేజ్‌కు, భాషకు పరిమితం కాకుండా వైవిధ్యమైన పాత్రలు చేస్తున్న వరలక్ష్మి ఇప్పుడు ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ బ్యానర్ పై అనిల్ కాట్జ్ దర్శకత్వంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ “శబరి” మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు మదన్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, నిర్మాత “నాంది” సతీష్ వర్మ క్లాప్ ఇచ్చారు. సీనియర్ దర్శకులు బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. సినిమా ప్రారంభం సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: