‘దుల్కర్’ సినిమాలో ‘రష్మిక’.. ఫస్ట్ లుక్ రిలీజ్..!

Rashmika Mandanna First Look from Dulquer Movie Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rashmika Mandanna,Rashmika Mandanna Upcoming Movie,Rashmika Mandanna latest Movie Updates,Rashmika Mandanna as Afreen,Rashmika Mandanna in Dulquer Salmaan’s Upcoming Film, Rashmika Mandanna First Look,Rashmika Mandanna First Look From Dulquer Upcoming Movie,Dulquer Salmaan upcoming Movies,Dulquer Salmaan New Movie,Dulquer Salmaan with Rashmika Mandanna Movie,Hanu Raghavapudi’s film,Meet our rebellious Afreen,Happy birthday Rashmika

ఇండస్ట్రీలోకి రావడం ఒక ఎత్తైతే.. ఇండస్ట్రీలో రాణించడం మరో ఎత్తు. ఇండస్ట్రీలో స్టార్ రేంజ్ కు రావాలంటే అంత ఈజీ ఏం కాదు. అందులోనూ ఇప్పుడున్న పోటీ వాతావరణంలో ఇంకా కష్టం. కానీ అంతటి పోటీ వాతావరణంలోనూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొంతకాలానికే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది రష్మిక మందన్న. క‌న్న‌డ‌లో ‘కిరిక్ పార్టీ’ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక ప్ర‌స్తుతం సౌత్ టూ నార్త్ వ‌ర‌కూ అన్ని భాషలను కవర్ చేస్తుంది. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ప్రస్తుతం పీక్ కెరీర్ లో దూసుకుపోతుంది. గతఏడాది చివరిలో పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అందుకోగా రీసెంట్ గా ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీతో సూపర్ హిట్ అందుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు రష్మిక తన పుట్టిన‌రోజును జరుపుకుంటుంది. ఈ సంద‌ర్భంగా అభిమానులతో పాటు సినీప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా బ‌ర్త్‌డే విషెస్‌ను తెలియ‌జేస్తున్నారు. మరోవైపు తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కూడా వస్తున్నాయి. దీనిలో భాగంగానే టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ వారు ఒక అప్ డేట్ ఇచ్చారు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్ లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో సరసన రష్మిక నటించనుంది. ఈనేపథ్యంలో ఈసినిమా నుండి తన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాలో అఫ్రీన్ అనే ముస్లిం యువతిగా నటించనుంది రష్మిక. ఇక రష్మిక లుక్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై స్వప్న దత్ ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఇక ప్రస్తుతం రష్మిక ఖాతాలో పలు సినిమాలు ఉన్నాయి. తెలుగులో పుష్ప 2 సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇంకా హిందీలో సిద్ధార్థ్ మ‌ల్హోత్రా హీరోగా న‌టించిన ‘మిష‌న్ మ‌జ్నూ’తో ర‌ష్మిక బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఈ చిత్రం జూన్ 10న విడుద‌ల కానుంది. దీనితో పాటుగా బిగ్‌బీ అమితాబ్‌తో కలిసి ‘గుడ్‌బై’ సినిమాలో న‌టించింది. అంతేకాకుండా తాజాగా సందీప్‌రెడ్డి వంగా తెర‌కెక్కిస్తున్న‌ ‘యానిమ‌ల్’ సినిమాలో ర‌ణ్‌బీర్ క‌పూర్‌కు జోడీగా న‌టుస్తున్న‌ట్లు తెలుస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =