చిన్న పాత్రల ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టిన సుధీర్ బాబు ఆతర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు పలు సినిమాలతో కెరీర్ లో బిజీగా ఉన్నాడు సుధీర్ బాబు. గతఏడాది “శ్రీదేవి సోడా సెంటర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబుకు ఆసినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది. ఇప్పుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ‘సమ్మోహనం’, వి తరువాత “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇంకా హర్షవర్ధన్ దర్శకత్వంలో కూడా మరో సినిమాను చేస్తుండగా ఈసినిమా షూటింగ్ ను ఇటీవలే స్టార్ట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాతో పాటు మరో సినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టాడు సుధీర్ బాబు. సుధీర్ బాబు హీరోగా మహేష్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఫిబ్రవరి రెండో వారంలో ఈసినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభమవ్వగా.. ఈ రోజు హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ “సుధీర్ బాబు హీరోగా ‘శమంతకమణి’ తర్వాత మా సంస్థలో చేస్తున్న చిత్రమిది. ఇదొక హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్. ఈ రోజు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశాం. ఏప్రిల్ 23 వరకూ ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. ఇందులో సుధీర్ బాబు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో సీనియర్ హీరో శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్, గోపరాజు రమణ, ‘జెమినీ’ సురేష్, మైమ్ గోపి, అజయ్ రత్నం తదితరులు నటిస్తున్నారు. తొలి షెడ్యూల్‌లో హీరో, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించడానికి ఏర్పాట్లు చేశాం” అని చెప్పారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.