అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్‌కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఈసినిమాలో రణ్‌బీర్‌కపూర్ శివ పాత్రలో నటిస్తుండగా అలియా ఇషా పాత్రలో కనిపించనుంది. ఇక భారీ బడ్జెట్ తో.. భారీ విజువల్ ఎఫెక్స్ట్ తో తెరకెక్కిస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడ జరుపుకుంటుంది. ఇక చిన్నగ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసింది. ఇప్పటికే రణ్ బీర్ కపూర్ కు సంబంధించిన గ్లింప్స్, అలానే అలియాకు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. బ్రహ్మాస్త్ర చివరి షెడ్యూల్ గత కొద్దికాలంగా కాశీ లో జరుగుతుంది. ఇక నేడు అక్కడే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఈవిషయాన్ని చిత్రయూనిట్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
It’s a wrap!🙏
Brahmāstra Part One: ShivaSee you in the cinemas on 09.09.2022!#Brahmastra pic.twitter.com/EU2mVc0Fuq
— BRAHMĀSTRA (@BrahmastraFilm) March 29, 2022
కాగా ఈసినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, అలానే నాగర్జున మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇంకా ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, రణ్ బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా బ్రహ్మాస్త్ర చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈసినిమా రెండు పార్ట్ లుగా రానున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఈసినిమా మొదటి పార్ట్ ను సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: