డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా లైగర్. ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. గతంలో పూరీ అనుకున్న జనగణమన సినిమానే విజయ్ తో చేస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇదిలా ఉంటే తాజాగా మరో సాలిడ్ అప్‌డేట్ వచ్చింది. పూరీ డైరెక్షన్‌లో మరో సినిమా చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు విజయ్. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో 29-03-2022, 14:20 గంటలకు నెక్స్ట్ మిషన్ లాంచ్ అని రాసి ఉంది. అంటే రేపు మధ్యాహ్నం 2.20 నిమిషాలకు సినిమాకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. మరి ఇది పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన మూవీ అప్ డేట్ గురించా? లేదంటే మరేదైనా కొత్త ప్రాజెక్టా? అన్నది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే!
— Vijay Deverakonda (@TheDeverakonda) March 28, 2022
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: