రీఎంట్రీ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అంతేకాదు వరుసగా వకీల్ సాబ్, భీమ్లానాయక్ లాంటి బ్లాక్ బస్టర్ లను దక్కించుకున్నాడు. ఇక ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నాడు పవన్. ఈసినిమా ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే మధ్యలో భీమ్లానాయక్ సినిమా షూటింగ్ లో పాల్గొనడంతో ఈసినిమా షూటింగ్ లేట్ అవుతుంది. ఇక ఇప్పుడు మళ్లీ షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు మేకర్స్. దీనికోసం ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక భారీ సెట్ ని కూడా నిర్మించినట్టు సమాచారం. ఈ షెడ్యూల్ లో హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా పాల్గొననున్నట్టు తెలుస్తుంది. ఈ షెడ్యూల్ తో దాదాపు చాలా వరకూ షూటింగ్ పూర్తవుతుందట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా మొఘలాయిల కాలం నాటి కథగా రూపొందుతుంది. ఈసినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. బాలీవుడ్ నుండి అర్జున్ రాంపాల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఇకపోతే ఈ మూ ఈ ఏడాది విజయ దశమి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: