డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ కి కీరవాణి సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“రౌద్రం రణం రుధిరం” మూవీ ప్రమోషన్స్ ను మేకర్స్ భారీగా చేపట్టిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రమోషనల్ ఈవెంట్స్ , పలు ఇంటర్వూస్ తో “ఆర్ ఆర్ ఆర్ “టీమ్ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే డైరెక్టర్ అనిల్ రావిపూడి తో ఒక ఇంటర్వ్యూ, సంగీత దర్శకుడు కీరవాణితో మరో ఇంటర్వ్యూ జరిపి ఆసక్తి పెంచిన “ఆర్ఆర్ఆర్” త్రయం తాజాగా యాంకర్ సుమతో మీమర్స్ స్పెషల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఇక సుమ ఎక్కడ ఉంటె అక్కడ నవ్వులే.. కానీ ఇక్కడ మాత్రం తారక్ సుమపై పంచులు వేయడంతో మరింత ఆసక్తికరంగా మారింది.మీమర్స్ స్పెషల్ అని అనడమే కాకుండా ఇంటర్వ్యూ మొత్తం మీమ్స్ తోనే సాగేలా చేశారు. సినిమా మొదలైనప్పటినుంచి.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేవరకు వచ్చిన మీమ్స్ ని చూపించి సుమ ఆసక్తికరమైన విషయాలను రాబట్టారు. మీమర్స్ ఇంత క్రియేటివ్ గా చేయడం మాములు విషయం కాదనీ , తమ సినిమాపై ఇంత అభిమానం చూపించినందుకు ధన్యవాదాలని తెలిపారు. ఇక మొత్తానికి సుమ, తారక్ పంచులతో ఈ ఇంటర్వ్యూ ప్రేక్షకులకు నవ్వులు పూయించింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: