సినిపరిశ్రమల్లో ఒకదాని తర్వాత ఒకటి విషాద పరిస్థితులు నెలకొంటున్నాయి. గత రెండెళ్లలో ఎప్పుడూ లేనివిధంగా సినీ పరిశ్రమ ఎంతో మందిని కోల్పోయింది. నటీనటులు, గాయకులు, రచయితలు ఇలా చాలామంది మృతి చెందారు. రీసెంట్ గా భారతరత్న గ్రహీత లతా మంగేష్కర్ కన్ను మూశారు. ఇక ఇటీవలే టాలీవుడ్ సిరివెన్నెల సీతారామశాస్త్రి లాంటి లెజెండరీ గేయ రచయితను కోల్పోగా.. ఇప్పుడు మరో గేయ రచయితను టాలీవుడ్ కోల్పోయింది. ఆయన కందికొండ యాదగిరి. గత కొంతకాలంగా వెన్నెముక సమస్య కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కందికొండ యాదగిరి. అయితే నేడు హైదరాబాద్‌లోని వెంగళరావు నగర్‌లోని తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఇక ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియచేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన కందికొండ యాదగిరి.. పూరీ జగన్నాథ్-రవితేజ కాంబినేషన్ లో వచ్చిన “ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం” సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసినిమాలో “మళ్లి కూయవే గువ్వా..” అన్న పాటను రాయగా.. ఆ పాటకు గుర్తింపు రావడంతో ఆ తర్వాత పలు సినిమాలతో బిజీ అయిపోయారు. ఆ తర్వాత ఇడియట్, సత్యం, పోకిరి, లవ్‌లీ, నీది నాది ఒకే కథ.. తదితర చిత్రాలకు ఆయన పాటలు రాశారు. అయితే 2018లో వెన్నెముక సమస్య తలెత్తడంతో తీవ్ర అనారోగ్యానికి గురైన కందికొండ అప్పటినుండి పాటలు రాయలేకపోయారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: