రీసెంట్ గానే ఖిలాడి తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ.. ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో రామారావు ఆన్ డ్యూటీ సినిమా కూడా ఒకటి. రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో వస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. ఈసినిమా కూడా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఒక పక్క షూటింగ్ ను పూర్తి చేసుకుంటూనే మరోపక్క ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. రీసెంట్ గానే ఈసినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేయగా.. టీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఇప్పటికే టాకీ పార్టు పూర్తి చేసింది. దీంతో చిత్రయూనిట్ పాటల చిత్రీకరణ పై దృష్టి సారించింది. దీనిలో భాగంగానే ఈ సినిమా టీమ్ ‘స్పెయిన్’ లో షూటింగ్ జరుపుకోడానికి.. అక్కడి అందమైన లొకేషన్స్ లో పాటలను చిత్రీకరించడానికి వెళ్లారు. పాటలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని శరత్ మండవ చెబుతున్నాడు. ఈ రెండు పాటల చిత్రీకరణతో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని సమాచారం.
కాగా ఈసినిమాలో దివ్యాంక కౌశిక్, రజిష విజయన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. వేణు తొట్టెంపూడి, నాజర్, తనికెళ్లభరణి, పవిత్ర లోకేష్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. అన్ని పనులు పూర్తిచేసి వీలైనంత త్వరగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: