గత ఏడాది ఎంతో మంది సినీ సెలబ్రిటీలను కోల్పోయాయి పలు సినీ పరిశ్రమలు. అందులో కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కూడా ఒకరు. పునీత్ రాజ్ కుమార్ మరణంతో ఒక్క కన్నడ పరిశ్రమ మాత్రమే కాదు దేశమొత్తం ఒక్కసారిగా షాక్ కు గురైంది. గత ఏడాది అక్టోబర్ 29న గుండె పోటుతో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో మరణించారు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఆయన అభిమానులతో పాటు అందరూ ఆయన చివరి సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా చివరి దశలో ఉండగానే పునీత్ మరణించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాను పునీత్ రాజ్ కుమార్ పుట్టినరోజు అంటే మార్చి 17వ తేదీన రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు చిత్రబృందం. అయితే పునీత్ చివరి సినిమా అవ్వడంతో ఈసినిమాను భారీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 4,000 స్క్రీన్లపై విడుదల చేయనున్నారు. ఒక్క కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగానే 400 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.
కాగా ఈ సినిమాలో రాజ్ కుమార్ సరసన ప్రియా ఆనంద్ నటిస్తుంది. చేతన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో శివ రాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్ కూడా కనిపించనున్నట్టు తెలుస్తుంది. పునీత్ భార్య అశ్విని పునీత్ ఈసినిమాను నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































