కొంత మంది హీరోయిన్స్ మొదట కాస్త విమర్శలు ఎదుర్కొన్నా ఓపికతో.. వారి హార్డ్ వర్క్ తో అలాంటి పరిస్థితులను ఎదుర్కొని టాప్ రేంజ్ కు దూసుకుపోతుంటారు. అలాంటి వారిలో అలియా భట్ కూడా ఒకరు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అలియా తన క్యూట్ లుక్స్ తో అందరినీ ఆకట్టుకుంది. కానీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిందని.. నెపోటిజం ట్యాగ్ యాడ్ చేస్తూ.. నటన రాదంటూ ఇలా ఎన్నో కామెంట్స్ ను ఎదుర్కొంది. కానీ ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా మనలో టాలెంట్ ఉంటేనే ప్రేక్షకులు కూడా ఆదరిస్తారన్న విషయం ఎంతో మంది విషయంలో రుజువైంది. అలియా విషయంలో కూడా అదే జరిగింది. కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా.. డీ గ్లామర్ పాత్రలు.. పాత్ర ప్రధానమైన పాత్రలు చేస్తూ టాలెంటెడ్ నటిగా ఇప్పుడు బాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. రీసెంట్ గా వచ్చిన గంగూబాయి కతియావాడి సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన మార్క్ ను చూపించింది అలియా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు బాలీవుడ్ లోనే కాకుండా ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తుండగా.. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ లోనే అరంగేట్రం చేస్తుంది. నెట్ ఫ్లిక్స్ స్పై థ్రిల్లర్ `హార్ట్ ఆఫ్ స్టోన్` లో
అలియా భట్ గాల్ గాడోట్ తో కలిసి పని చేయనుంది. జామీ డోర్నన్ కూడా మరో పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఏరోనాట్స్ చిత్ర నిర్మాత టామ్ హార్పర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు డేవిడ్ ఎల్లిసన్స్, డానా గోల్డ్ బెర్గ్, డాన్ గ్రాంజర్, మోకింగ్ బర్డ్ బోనీ కర్టిస్, జూలీ లిన్, పైలట్ వేవ్ గాడోట్ మరియు జారోన్ వర్సనోలు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. మరి హాలీవుడ్ లో కూడా అలియా తన నటనతో ఆకట్టుకుంటుందేమో చూద్దాం…




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: