కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

"రాధేశ్యామ్"తమిళ వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ స్పీచ్

Prabhas speech at Radhe Shyam Event,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Radhe Shyam in Tamil Version,Radhe Shyam Pre

"రాధేశ్యామ్"తమిళ వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ స్పీచ్

Prabhas speech at Radhe Shyam Event

Prabhas speech at Radhe Shyam Event,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Radhe Shyam in Tamil Version,Radhe Shyam Pre

గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్, సాంగ్స్, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. హిందీ వెర్షన్ కు మిథున్ సంగీతం అందించారు. థమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.

“రాధేశ్యామ్ ” మూవీ ప్రమోషన్స్ ను మేకర్స్ భారీగా చేపట్టారు. ముంబై లో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో హీరో ప్రభాస్ , హీరోయిన్ పూజాహెగ్డే , దర్శకుడు రాధాకృష్ణ కుమార్ పాల్గొన్నారు. తరువాత చెన్నై లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ పాల్గొన్నారు. ఆ ఈవెంట్ లో ప్రభాస్ మాట్లాడుతూ .. భారీ బడ్జెట్ తో "రాధేశ్యామ్"మూవీ ని నిర్మించిన నిర్మాతల ధైర్యానికి థ్యాంక్స్ అనీ , సత్యరాజ్ సర్ , తాను కలసి ఫస్ట్ టైమ్ సూపర్ హిట్ "మిర్చి "మూవీ లో కలసి నటించామనీ , తరువాత "బాహుబలి "లో నటించామనీ , ఇప్పుడు మరోసారి "రాధేశ్యామ్ "మూవీ లో స్క్రీన్ షేర్ చేసుకొనడం ఆనందంగా ఉందనీ , జస్టిన్ ప్రభాకరన్ అద్భుతమైన సంగీతం అందించారనీ , ప్రేరణ గా నటించిన హీరోయిన్ పూజాహెగ్డే అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారనీ , మా ఇద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించనుందనీ , సినిమాటోగ్రాఫర్ మనోజ్ మమ్మల్ని అందంగా చూపించారనీ , "బాహుబలి" , "సాహో" వంటి యాక్షన్ మూవీస్ తరువాత నాతో ఒక లవ్ స్టోరీని దర్శకుడు తెరకెక్కించారనీ , 4 సంవత్సరాలు ఈ సినిమాతో పాటు ట్రావెల్ చేసిన దర్శకుడు రాధాకృష్ణ కు థ్యాంక్స్ అనీ చెప్పారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్