వెండి తెర పుట్టిన దగ్గర నుండి ఎన్నో ప్రేమకథలను సిల్వర్ స్క్రీన్ పై చూసుంటాం. ప్రేక్షకులు కూడా ప్రేమకథలు ఎప్పుడు వచ్చినా వాటికి కనెక్ట్ అవుతూనే ఉంటారు. రొటీన్ గా కాకుండా ఆ ప్రేమకథల్లోనే కాస్త కొత్తదనం చూపిస్తే బ్రహ్మరథం పట్టేస్తారు. ఇక ఇప్పుడు అలాంటి ప్రేమకథతోనే ప్రేక్షకులను మాయ చేయడానికి వచ్చేస్తున్నాడు ప్రభాస్. కెరీర్ స్టార్టింగ్ లో కాస్త లవ్ స్టోరీలు తీసినా ఆ తరువాత కొంతకాలం యాక్షన్ సినిమాలకే పరిమితమైన ప్రభాస్ ఇప్పుడు రాధేశ్యామ్ లాంటి వింటేజ్ ప్రేమకథతో లవర్ బాయ్ లాగ మారిపోయాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాధాకృష్ణ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుండగా.. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఇటలీ బ్యాక్ డ్రాప్ లో వస్తుండగా..ఇద్దరి ప్రేమికులు- విధి మధ్య పోరాటమే ఈసినిమా నేపథ్యం అని ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ను బట్టి అర్థమవుతుంది. మరోవైపు ఈసినిమాలో విజువల్స్ హైలెట్ గా నిలుస్తాయని కూడా తెలుస్తుంది.
ఇక నిజానికి సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా థార్డ్వేవ్ వల్ల విడుదలను వాయిదా వేసింది చిత్ర యూనిట్. ఇప్పుడు మార్చి 11వ తేదీన రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈనేపథ్యంలో ఇది వరకే ఓ సారి ట్రైలర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. అయితే సినిమా విడుదల వాయిదా పడటంతో మరో ట్రైలర్ను నేడు రిలీజ్ చేసింది. ఇక రెండో ట్రైలర్ కూడా ఆకట్టుకుంటుంది. సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతుంది.
Love. Destiny. Action. Presenting the curtain raiser video of #RadheShyam. 💕#RadheShyamReleaseTrailer
Telugu: https://t.co/GtqETZ0LEU
Hindi: https://t.co/ZbEim6I4hB
Tamil: https://t.co/NYsfK0rF2F
Kannada: https://t.co/oSMUUE2uBY
Malayalam: https://t.co/vwT1NpfsNJ pic.twitter.com/YCk8oUICXJ— UV Creations (@UV_Creations) March 2, 2022
కాగా పిరియాడికల్ లవ్ స్టోరీగా 1960 దశకం నాటి ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈసినిమాలో కృష్ణంరాజు, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, రిద్ధి కుమార్, సాషా చెత్రి, కునాల్ రాయ్ కపూర్, భాగ్యశ్రీ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక సౌత్ లో ఈ సినిమా పాటల కోసం జస్టిన్ ప్రభాకరన్ పనిచేస్తుండగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను థమన్ అందించనున్నాడు. ఇక హిందీ పాటలకి మిథున్, అమాల్ మాలిక్, మనన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: