విక్రమ్ కుమార్ తో నాగచైతన్య కాంబినేషన్ లో వచ్చిన మనం సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. అక్కినేని ఫ్యామిలీకి మంచి క్లాసిక్ ను అందించాడు విక్రమ్ కుమార్. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మరో సినిమా థ్యాంక్యూ. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తుండగా.. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా వీరిద్దరి కాంబినేషన్ లో ఓ వెబ్ సిరీస్ వస్తున్న సంగతి తెలిసిందే. హర్రర్, థ్రిల్లర్ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ను విక్రమ్ కుమార్ రూపొందిస్తున్నారు. ఇక ఈ సిరీస్ కు దూత అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఆత్మలతో మాట్లాడి మానవులకు సందేశం ఇచ్చే దూతగా ఆయన కనిపిస్తారట. చిత్రంలో అదే పాయింట్ మేజర్ కాబట్టి ‘దూత’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని అంటున్నారు. ఇక తాజాగా ఈవెబ్ సిరీస్ ను కూడా స్టార్ట్ చేసేశారు. ఈ విషయాన్ని చైతు స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. దీన్ని అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సంస్థ నిర్మిస్తుంది.
View this post on Instagram




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: