ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రతి ఒక్క హీరో రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఆ లిస్ట్ లో మాస్ మహారాజా రవితేజ కూడా ఉన్నాడు. అయితే రవితేజ మాత్రం కేవలం సినిమాల షూటింగ్ లలో మాత్రమే కాదు రిలీజ్ చేసే విషయంలో కూడా స్పీడుమీదున్నాడు. రీసెంట్ గానే ఖిలాడి తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు పలు సినిమాలు లిస్ట్ లో ఉండగా.. అందులో రామారావు ఆన్ డ్యూటీ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో వస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నేడు మహాశివరాత్రి సందర్భంగా తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక టీజర్ ను బట్టి రవితేజ పవర్ ఫుల్ రోల్ తో వస్తున్నట్టు అర్థమవుతుంది. ఈ చిత్రంలో కమిట్ మెంట్ తో పనిచేసే పవర్ ఫుల్ గవర్నమెంట్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇక ‘పేరు, రూపం సింపుల్‌గా ఉన్న వాడు సూపర్ మ్యాన్’ అంటూ రవితేజ గురించి చెప్పే డైలాగ్స్ తో టీజర్ మొదలవుతుంది. ‘ఆయుధంపై ఆధారపడే నీలాంటి వాడి ధైర్యం.. వాడే ఆయుధంలో ఉంటుంది. ఆయుధంలా బ్రతికే నాలాంటి వాడి ధైర్యం అణువణువున ఉంటుంది’ అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది.
Duty calling!! 👊🏻 #RamaRaoOnDuty
Happy #Mahashivratri 😊https://t.co/VYQN54DQAW— Ravi Teja On Duty (@RaviTeja_offl) March 1, 2022
కాగా ఈసినిమాలో దివ్యాంక కౌశిక్, రజిష విజయన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. వేణు తొట్టెంపూడి, నాజర్, తనికెళ్లభరణి, పవిత్ర లోకేష్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. మార్చి 25న లేదా ఏప్రిల్ 15న ఈ మూవీని విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. మరోవైపు ఓటీటీ రిలీజ్ అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఫైనల్ మేకర్స్ ఏం డిసైడ్ చేస్తారో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: