బాహుబలి ప్రాంఛైజ్ తరువాత గ్లోబల్ స్టార్ అయిపోయాడు ప్రభాస్. బాహుబలి సిరీస్ వల్ల ప్రభాస్ కు జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఇక ఆ తరువాత వచ్చిన సాహో తో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ప్రస్తుతం అయితే వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ సినిమా రిలీజ్ అంటే మాములుగా ఉండదు కదా. ఈనేపథ్యంలోనే ఇప్పుడు రాధేశ్యామ్ సినిమాను కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల స్క్రీన్లలో ఈసినిమాను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అయితే ఒక్క యూఎస్ఏలోనే మునుపెన్నడూ లేని విధంగా రాధేశ్యామ్ ను రికార్డ్ స్థాయిలో స్క్రీన్ లలో రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు చిత్రబృందం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా ఏకంగా 10, 000 థియేటర్లలో రిలీజ్ కానుండగా ఒక్క అమెరికాలోనే 1116కి పైగా లొకేషన్లలో, 3116కి పైగా స్క్రీన్ లలో , 11116కి పైగా షోలు వేయనున్నట్టు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. వీటిలో 1000కి పైగా స్క్రీన్ లలో తెలుగు వెర్షన్ ను.. హిందీ వెర్షన్ ను కూడా పలు స్క్రీన్ లలో రిలీజ్ చేస్తున్నారు. ఏహీరో సినిమా కూడా ఈ స్థాయిలో రిలీజ్ కాలేదు.. కేవలం ప్రభాస్ సినిమా మాత్రమే ఆ రికార్డ్ ను సొంతం చేసుకుంది. మరి ఈ సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో రికార్డులు క్రియేట్ అవుతాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదనే చెప్పాలి.
కాగా పిరియాడికల్ లవ్ స్టోరీగా 1960 దశకం నాటి ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా పూజాహెగ్డే నటించియిది. ఐదు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా దీన్ని రూపొందించారు. రెబల్‌స్టార్ కృష్ణంరాజు సమర్పణలో రూపొందుతున్న ఈ ‘రాధే శ్యామ్’ సినిమాని గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: