మొత్తానికి ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్న భీమ్లానాయక్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక వస్తూ వస్తూనే పవన్ బాక్సాఫీస్ వద్ద దండయాత్ర మొదలుపెట్టాడు. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఇచ్చాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఇలాంటి పాత్ర చేయలేదని.. ఫుల్ మాస్ రోల్ లో పవన్ ఇరగదీశాడని ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక ఎన్నో అడ్డంకులు ఉన్నా కూడా వాటన్నింటినీ అధిగమించి విజయబావుటా ఎగరవేసింది ఈసినిమా. ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ను కొల్లగొడుతూ దూసుకుపోతుంది. ఒక్క రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో కూడా “భీమ్లానాయక్ ” మూవీ హవా నడుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రతినాయకుడి పాత్రలో నటించిన రానా దగ్గుబాటి కి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. డానియేల్ శేఖర్ పాత్రలో రానా ను తప్ప మరో హీరోను ఊహించుకోలేము అన్న ప్రశంసలు దక్కించుకున్నాడు రానా. ఈ ప్రశంసలపై రానా కూడా స్పందిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. వావ్… ఇవాళ అంతా అభినందనలు వెల్లువెత్తాయి. అభిమానులకు, ప్రేక్షకులకు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థకు, వంశీ, చినబాబు గారు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, అద్భుతమైన కథానాయకుడు పవన్ కల్యాణ్ గారికి కృతజ్ఞతలు అంటూ రానా ట్వీట్ చేశారు.
Wow!! A day full of praises!! A huge Thank you from the bottom of my heart to the lovely audience and fans. A big you to @SitharaEnts @vamsi84 #ChinnaBabu garu, @saagar_chandrak the awesome #Trivikram and the magnificent @PawanKalyan garu for the opportunity!!#BheemlaNayakMania pic.twitter.com/5VEzJOD4qA
— Rana Daggubati (@RanaDaggubati) February 25, 2022
కాగా సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాకు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా సముద్రఖని, మురళీశర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈసినిమాను నిర్మించగా.. థమన్ సంగీతం అందించాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: