జగపతి బాబు సంచలన నిర్ణయం

Jagapathi Babu Takes A Superb Decision,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Jagapathi Babu,Jagapathi Babu Movie,Jagapathi Babu Upcoming Movie,Jagapathi Babu latest Updates,On 60th birthday Jagapathi Babu pledges to donate organs, Jagapathi Babu pledged to donate his organs,Jagapathi Babu pledges organs on his 60th birthday,Jagapathi Babu in Blockbuster Movie Legend,Jagapathi Babu Villain Roles, Jagapathi Babu most Wanted Villain In Tollywood Industry,Jagapathi Babu Gani Movie,Jagapathi Babu in Radhe shyam Movie,Jagapathi Babu Upcoming Movie Saalar, Jagapathi Babu 6oth Birthday,Jagapathi Babu Happy Birthday,Bhaskar Rao Bollineni kims,Dr.B.Bhaskar Rao KIMS Hospitals,Jagapathi babu About Organ Donation,#jagapathibabu

“సింహస్వప్నం”(1989 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన జగపతిబాబు పలు సూపర్ హిట్ మూవీస్ లో హీరోగా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “లెజెండ్” (2013)మూవీ లో స్టైలిష్ విలన్ గా నటించి ప్రేక్షకులను అలరించారు. పలు సూపర్ హిట్ మూవీస్ లో విలన్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన జగపతి బాబు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారారు. జగపతి బాబు నటించిన “గని “, “రాధేశ్యామ్ “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం జగపతి బాబు “సలార్” మూవీ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జగపతి బాబు తన 60 వ పుట్టిన రోజున సంచలన నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) హాస్పిటల్స్ లో జరిగిన ఓ సమావేశంలో తన అవయవాలను దానమిస్తున్నానని జగపతి బాబు ప్రకటించారు. ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగపడే తన కీలక అవయవాలను దానం చేస్తానన్న ప్రతిజ్ఞపై జగపతి సంతకం చేశారు. తన 100 మంది స్నేహితులు, అభిమానులను మానవత్వం అనే కోణంలో సేవ కోసం అవయవాలను దానమివ్వాలనీ , ప్రతిజ్ఞ చేయమని జగపతి బాబు ప్రోత్సహించారు. జగపతి బాబు మాట్లాడుతూ .. మనిషి బతుక్కి ఒక అర్థం ఉండాలనీ , మనం భాగమైన ఈ సమాజానికి మనమే ఏదైనా తిరిగి ఇవ్వగలిగితే మన జీవితానికి సరైన అర్థం ఉంటుందనీ , అవయవ దానం తో పలువురికి సహాయం చేయడంలో మంచి ఉందని తాను నమ్ముతున్నాననీ , మనమంతా మరణానంతరం చేయాల్సినవి కచ్చితంగా ఆలోచించాల్సిన గొప్ప విషయం అనీ చెప్పారు. కిమ్స్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కర్ రావు మాట్లాడుతూ.. జగపతిబాబు తన నటజీవితంలో ఎన్నో పాత్రలు పోషించి ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారనీ , తన పుట్టిన రోజు సందర్భంగా తన అవయవాలను దానమిచ్చి సమాజంలోని కోట్లాది మందికి నిజమైన హీరోగా నిలిచారనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.