టాలెంటెడ్ హీరో శర్వానంద్.. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా వస్తున్న కిషోర్ తిరుమలశెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఆడవాళ్ళు మీకు జోహార్లు. నేను శైలజ, చిత్రలహరి సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు కావడంతో ఈ సినిమా మీద అంచనాలున్నాయి. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 25న ఈసినిమా థియేటర్లలో రిలీజ్ కానున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంకా ఈసినిమాలో వెన్నెల కిశోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోపరాజు, బెనర్జీ, కల్యాణీ, నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్యకృష్ణ, ఆర్‌సీఎమ్ రాజు తదితరులు నటిస్తున్నారు.జాతీయ అవార్డులు సాధించిన శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకు సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఇక ఇదిలా ఉండగా ఫిబ్రవరి 25న ఇప్పటికే భీమ్లానాయక్ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. రిలీజ్ డేట్ మారే ఛాన్స్ ఉంది అంటున్నారు. భీమ్లానాయక్ రిలీజ్ డేట్ వాయిదా పడితే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు.. ఒకవేళ రిలీజ్ డేట్ కనుక మారకపోతే శర్వానంద్ మంచి పోటీని ఎదుర్కోవాల్సిందే. అంతేకాదు తాజాగా అలియా గంగూబాయి కతియావాడి సినిమా కూడా అదే రోజున రాబోతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: