ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. దర్శకుడు బోయపాటి , హీరో బాలకృష్ణ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన “అఖండ” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ , డైలాగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు USA లో కూడా భారీ కలెక్షన్స్ తో “అఖండ ” మూవీ దూసుకుపోతోంది. “అఖండ “మూవీ త్వరలోనే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వైజాగ్ లో ‘అఖండ విజయోత్సవ జాతర’ పేరుతో సక్సెస్ సెలెబ్రేషన్స్ జరిగింది. తమన్ మినహా చిత్ర యూనిట్ మొత్తం అఖండ విజయోత్సవ వేడుకలో పాల్గొంది. బాలయ్యతో పాటు దర్శకుడు బోయపాటి, శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్, పూర్ణ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు. విజయోత్సవ జాతరలో బాలయ్య మాట్లాడుతూ .. దర్శకుడు బోయపాటి తో తనకు ర్యాపో కుదిరిందనీ , ఇంతటి ఘనవిజయం అందించిన అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలనీ , నటీనటుల నుంచి, టెక్నీషియన్ల నుంచి ఏం కావాలో రాబట్టుకోగలిగే సామర్థ్యం ఉన్న దర్శకుడు బోయపాటి అనీ బాలయ్య ప్రశంసించారు. “అఖండ “చిత్రం ఈ పరిస్థితుల్లో విడుదలై మంచి విజయం సాధించడం మాత్రమే కాదు.. ఇండస్ట్రీకి ధైర్యాన్ని ఇచ్చిందనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: