వైజయంతి మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో మాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా వార్ అండ్ లవ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న మూవీ ప్రస్తుతం సెట్స్ మీదున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో దుల్కర్ లెఫ్టినెంట్ రామ్ గా నటిస్తున్నారు.ఆసక్తికరమైన కథాకథనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ లో బాలీవుడ్ నటి మృణాళి ఠాకూర్ కథానాయిక. ఈ మూవీ కి “లెఫ్టినెంట్ రామ్” అనే టైటిల్ పరిశీలనలో ఉంది. దుల్కర్ సల్మాన్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ఒక గ్లిమ్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మిలటరీ బేస్ లో తెరకెక్కుతున్నప్పటికీ ఓ అందమైన ప్రేమకథా చిత్రం గా తెరకెక్కుతున్న ఈ మూవీ తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో 9 రోజుల షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని దుల్కర్ సల్మాన్ తన ఫేస్ బుక్ పేజ్ లో తెలియచేస్తూ దానికి సంబంధించిన ఫోటోస్ షేర్ చేశారు. దుల్కర్ లాంటి మంచి పెర్ఫార్మర్ తో ఓ డిఫరెంట్ లవ్ స్టోరీగా ఈ సినిమాను రూపొందిస్తున్న హను రాఘవపూడికి మంచి బ్రేక్ ఇస్తుందని ఆశిద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: