ఇండస్ట్రీల్లో హిట్ కాంబినేషన్స్ లో సినిమాలు రావడం చూస్తూనే ఉంటాం. హీరో హీరోయిన్ కాంబినేషన్ లో కానీ, డైరెక్టర్ హీరో కాంబినేషన్ లో ఏ కాంబినేషన్ లో సినిమా హిట్ మరోసారి ఆ కాంబినేషన్ ను రిపీట్ చేస్తారు. ఇక ఇప్పుడు రజినీ కూడా మరోసారి అన్నాత్తే డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. శివ దర్శకత్వంలో రజినీ హీరోగా అన్నాత్తే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. తెలుగులో పెద్దన్న టైటిల్ తో ఈసినిమా రిలీజ్ అయింది. దీపావళి కి రిలీజ్ అయిన ఈసినిమా మంచి రెస్పాన్స్ తో పాటు సాలిడ్ కలెక్షన్స్ ను సైతం దక్కించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా వస్తున్న వార్తల ప్రకారం మళ్లీ శివకి ఛాన్స్ ఇవ్వాలని రజనీ నిర్ణయించుకున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. స్టోరీ సంగతి పక్కన పెడితే ఈసినిమాలో శివ తనను చూపించిన విధానం తనకు నచ్చిందట. అందుకే తనకోసం మరో కథను రెడీ చేయమని శివకు చెప్పాడట రజనీ. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇక శివ విషయానికొస్తే ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా సినిమాలు చేస్తున్నాడు. ఇక గతంలో ఒక్క అజిత్ తోనే కలిసి వరుసగా ‘వీరం, వివేగం, వేదాళం, విశ్వాసం’ లాంటి సినిమాలు తీసి తమిళ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. మరి ఇప్పుడు రజినీతో మరో ఛాన్స్ కొట్టేశాడంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: