కరోనా తరువాత సినిమాలు వరుసగా రిలీజ్ అవుతుండటంతో చాలా సినిమాలకు పోటీ తప్పట్లేదు. చాలా జాగ్రత్తగా రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకుంటున్నా రిలీజ్ క్లాష్ తప్పడం లేదు. నిజానికి సంక్రాంతికి చాలా సినిమాలు పోటీకి సిద్దపడినా ఆ తరువాత ఆ బరి నుండి తప్పుకున్నాయి. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో రెండు పాన్ ఇండియా సినిమాల మధ్య పోటీ ఏర్పడనుంది. ఆసినిమాలు కె.జి.యఫ్2 ఇంకోటి లాల్ సింగ్ చద్దా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిజానికి ‘కె.జి.యఫ్ ఛాప్టర్ 2’ ఈ సినిమా గత ఏడాదిలోనే విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వాయిదా పడుతూ వచ్చాయి. ఫైనల్ గా వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఆమీర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా ‘లాల్ సింగ్ చద్దా’ కూడా ఇదే తేదీన రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ‘సీక్రెట్ సూపర్ స్టార్’ ఫేమ్ అద్వైత్ చందన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీతో టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈసినిమాను కూడా ఏప్రిల్ 14న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.
మరి ఇదే రోజున కె.జి.యఫ్ 2 రిలీజ్ అవుతుండటంతో రెండు సినిమాల మధ్య పోటీ ఉండబోతున్నట్టు అర్థమవుతుంది. చూద్దాం మరి ఆలోపు రెండు సినిమాల్లో ఏ సినిమా రిలీజ్ డేట్ అయినా మారుతుందేమో..
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: