మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే కదా. దీంతో అటు మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు, సన్నిహితులు అందరూ ఆందోళన చెందారు. దాదాపు నెల రోజులకు పైగా అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందిన తేజ్ ఇటీవలే డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చారు. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం సాయి తేజ్ పూర్తిగా కోలుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నొప్పులు తగ్గేందుకు గాను ఫిజియో థెరపీ, స్పీచ్ థెరపీ చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లోనే తేజ్ తన కొత్త చిత్రం షూటింగ్‌లో పాల్గొననున్నాడని వార్తలు వస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా రీసెంట్‌గా దేవాకట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన ‘రిపబ్లిక్’ సినిమా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ మిస్టికల్ థ్రిల్లర్ నేపథ్యంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారు .




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: