రీఎంట్రీ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక దీనితోపాటు పవన్-క్రిష్ కాంబినేషన్ లో హరి హర వీరమల్లు సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలయింది. కానీ కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడగా మళ్లీ షూట్ ను స్టార్ట్ చేయలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా నెక్ట్స్ షెడ్యూల్‌ను నవంబర్ నుంచి ప్రారంభించేలా ప్లాన్ చేసుకున్నామని ఇప్పటికే క్రిష్ తెలిపారు. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఈసినిమాలో పవన్ కు జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్ పంచమి అనే పాత్రలో నటిస్తుండగా.. తాజా సమాచారం ప్రకారం నిధి డ్యాన్సర్ గా నటించనున్నట్టు తెలుస్తుంది.
కాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పీరియాడికల్ డ్రామా ఇది. మొఘల్ కాలంలో ప్రజలకు అండగా నిలబడిన ఓ బందిపోటు దొంగ పాత్రనే ఇందులో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. ఇంకా ఈసినిమాలో బాలీవుడ్ నుండి జాక్వలైన్, అర్జున్ రాంపాల్ కూడా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: