సక్సెస్ ఫుల్ “ఊహలు గుస గుసలాడే” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రాశీఖన్నా పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషల ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న రాశీఖన్నా బాలీవుడ్ లో రెండు వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. నాగచైతన్య “థ్యాంక్ యు”, గోపీచంద్ “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు “అరణ్మణై 3”, “తుగ్లక్ దర్బార్”, “సర్దార్”, “మేధావి”, “సైతాన్ కా బచ్చా”(తమిళ ) ‘భ్రమమ్’ (మలయాళ) మూవీస్ లో రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ మోడరన్ , ట్రెడిషినల్ డ్రెస్ లతో ఫొటో షూట్స్ లో పాల్గొని రాశీఖన్నా ఆ ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రాశీఖన్నా ఇన్ స్టా గ్రామ్ లో అభిమానులతో ముచ్చటించారు.తెలుగు లో రాశీఖన్నా అభిమాన తారల గురించి ఒక అభిమాని అడగగా హీరోలలో మహేష్ బాబు , ఎన్టీఆర్ , అల్లు అర్జున్ అనీ , హీరోయిన్స్ లో అనుష్క , సమంత అనీ చెప్పారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: