సాగర్ చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా రూపొందుతున్న చిత్రం భీమ్లా నాయక్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక ఇటీవలే ఈసినిమా నుండి పవన్ ఇంట్రడక్షన్ వీడియోను అలాగే పలు పోస్టర్లు రిలీజ్ చేయగా వాటికి ఎంత రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే పవన్ ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్ చేసినప్పుడు పలు కామెంట్స్ కూడా వచ్చాయి. భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించి రానాకు సంబంధించిన ఏ అప్డేట్, పోస్టర్, ఇవ్వలేదని రానా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్టీస్టారర్ సినిమా అయినా కూడా కేవలం పవన్ కల్యాణ్ ను మాత్రమే హైలెట్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇక ఈ కామెంట్స్ పై అప్పుడే మేకర్స్ స్పందించి రానా కు స్పెషల్ ఇంట్రడక్షన్ వీడియో ఉంటుందని అందుకే చూపించలేదని క్లారిటీ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు డానియెల్ శేఖర్ ఇంట్రడక్షన్ కు టైమొచ్చింది. ఈసినిమా నుండి రానా ఇంట్రడక్షన్ వీడియోను రిలీజ్ చేస్తున్నట్టు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. ‘బ్లిట్జ్ ఆఫ్ డానియెల్ శేఖర్’ ప్రోమోను ఈనెల 20న విడుదల చేయబోతున్నట్లుగా పోస్టర్ రిలీజ్ చేశారు.
Get ready to experience the #BLITZofDANIELSHEKAR, @RanaDaggubati from 20th Sept💥#BheemlaNayak @pawankalyan #Trivikram @MenenNithya @MusicThaman @saagar_chandrak @dop007 @NavinNooli @vamsi84 @adityamusic pic.twitter.com/2BYtBOzLEK
— Sithara Entertainments (@SitharaEnts) September 17, 2021
కాగా పవన్ కి జోడీగా నిత్యామీనన్, రానాకి జంటగా ఐశ్వర్యా రాజేష్ నటిస్తుండగా.. సముద్రఖని, మురళీశర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: