‘తిమ్మరుసు’ వచ్చే సినిమాలకు ఆక్సిజన్ అవ్వాలి

Natural Star Nani Wants Thimmarusu To Give A Good Start For Movies Releasing In Theatres Post Covid,Nani Emotional Speech,Thimmarusu Pre-Release Event LIVE,Thimmarusu Pre Release Event LIVE,Thimmarusu Movie Trailer,Thimmarusu Trailer,SatyaDev,Priyanka Jawalkar,Telugu FilmNagar,Sharan Koppisetty,Thimmarusu Teaser,Thimmarasu,Timmarasu,SatyaDev Thimmarusu Trailer,Latest Telugu Movie 2021,Thimmarusu Telugu Movie Trailer,Thimmarusu Songs,Timmarusu Pre-Release,Thimmarusu Pre-Release,Satyadev Thimmarusu,Thimmarasu,Thimmarusu,Satyadev Thimmarusu Movie,Thimmarusu Latest 2021 Telugu Movie,Thimmarusu Movie 2021,Priyanka Jawalkar Movies,Actor Satyadev,Hero Satyadev,Satyadev Movies,Satyadev New Movie,Satyadev Latest Movie,Thimmarusu Pre Release Event,Thimmarusu Movie Pre Release Event,Thimmarusu Telugu Movie Pre Release Event,Thimmarusu Movie Pre Release Event LIVE,Thimmarusu Movie Pre Release Event Live,Thimmarusu Pre Release Event Live,Thimmarusu Live,Thimmarusu Movie Satyadev,Satyadev Thimmarusu Movie,Thimmarusu Pre Release,Nani Speech,Nani Speech At Thimmarusu Pre Release Event,Nani Thimmarusu Pre Release Event,Natural Star Nani,Nani,Nani Movies,Nani New Movie,Actor Nani,Hero Nani,Nani Latest News,Nani Emotional Speech At Thimmarusu Pre Release Event,Nani Latest Speech,Nani Speech Thimmarasu Pre Release,Nani Thimmarasu Pre Release Event Speech,#ThimmarusuPreReleaseEvent,#Thimmarusu

కరోనా వల్ల ఇన్ని రోజులు థియేటర్లు మూతపడటంతో సినిమాలన్నీ పెండింగ్ లో పడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు థియేటర్లు ఓపెన్ చేస్తుండటంతో రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. ఈనేపథ్యంలోనే ముందుగా ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు సత్యదేవ్. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగావస్తున్న సినిమా తిమ్మరుసు. ఈసినిమా జులై30న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లతో సినిమాపై అంచనాలు పెంచేశారు చిత్రయూనిట్. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి అతిథిగా న్యాచురల్ స్టార్ నాని రాగా.. ఈసినిమాపై, సత్య దేవ్ పై పలు ప్రశంసలు కురిపించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ మొదటినుంచి సత్య అంటే చాలా ఇష్టం. ఒక నటుడిగానే కాకుండా వ్యక్తిగతంగానూ ఇష్టమే. అతను ఎంత మంచి నటుడో మనందరికీ తెలుసు. తను నటుడిగా ప్రయాణం ఎప్పుడో మొదలు పెట్టాడు.. ఉమామహశ్వర ఉగ్రరూపస్య లాంటి సినిమాలో తను సోల్ పెట్టి నటించాడు.. ఆసినిమా థియేటర్ లో కనుక రిలీజ్ అయి ఉంటే స్టార్ గా కూడా జర్నీ ఎప్పుడో స్టార్ట్ చేసి ఉండేవాడు.. ఇప్పుడు ‘తిమ్మరుసు’తో ఒక స్టార్‌గా ప్రయాణం మొదలుపెట్టబోతున్నాడు. థియేటర్లో సినిమా చూడటం అనేది మన కల్చర్‌. నిజానికి కరోనా వల్ల ముందు క్లోజ్ చేసేది థియేటర్లు.. లాస్ట్ లో ఓపెన్ చేసేది థియేటర్లు.. కానీ మిగిలిన ప్లేస్ ల కంటే థియేటర్లే చాలా సేఫ్ ప్లేస్.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యం చాలా ముఖ్యం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా ఆస్వాదిద్దాం. త్వరలోనే ఈ కరోనా పరిస్థితులు అదుపులోకి వస్తాయని ఆశిద్దాం. థర్డ్‌వేవ్‌లాంటివి ఏవీ రాకుండా.. అన్ని సినిమాలను థియేటర్‌లలో అందరం కలిసి ఆస్వాదించాలని కోరుకుంటున్నా. ఇప్పుడు రాబోతున్న సినిమాలన్నింటికి ‘తిమ్మరుసు’ ఆక్సిజన్‌ ఇవ్వాలి’’ అని నాని అన్నారు.

కాగా సత్యదేవ్ సరసన ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రవిబాబు, బ్రహ్మాజి, అజయ్‌ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు‌తో కలిసి ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై నిర్మాత సృజన్‌ ఎరబోలు నిర్మిస్తున్న ఈసినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =