వెంకీ ప్రధాన పాత్రలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమా రీమేక్ గా నారప్ప ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా అమెజాన్ ప్రైమ్ లో ఈనెల 20న రిలీజ్ కాబోతుంది. దీనిలో భాగంగానే రీసెంట్ గానే ట్రైలర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ఈసినిమాను థియేటర్లలో రిలీజ్ చేయకుండా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నందుకు అభిమానులు కాస్త కోపంగా ఉన్న సంగతి తెలిసిందే. అందులోనూ టాలీవుడ్ లో టాప్ నిర్మాణ సంస్థ అయిన సురేష్ ప్రొడక్షన్స్ నుండి వస్తున్న సినిమా.. అయినా కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తుండటంతో అసంతృప్తితో ఉన్నారు. ఇక ఈనేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకీ అభిమానులకు సారీ చెప్పారు. ఓటీటీలో విడుదల అవడం వల్ల కొంతమంది ఫాన్స్ హ్యాపీగా ఫీలైతే, మరికొంతమంది బాధపడుతున్నారు. కానీ టైం వల్ల ఇలా జరిగింది నారప్ప సినిమా రిలీజ్ పై చాలా సిన్సియర్ గా సారీ చెప్తున్నాను. ఈ ఒక్క విషయంలో అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నాను. అలాంటి ఫ్యాన్స్ నాకు దక్కడం నిజంగా అదృష్టంగా భావిస్తాను అని తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ప్రియమణి హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో ప్రకాశ్‌రాజ్, మురళీశర్మ, కార్తిక్ రత్నం కూడా నటించారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించారు. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మించారు. మరి తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఈసినిమా తెలుగులో ఎంత వరకూ హిట్ అవుతుందో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: