ఒక సినిమా అయిపోతుండగానే మరో సినిమాను పట్టాలెక్కించేశాడు రవితేజ. రమేష్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఖిలాడి సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇక గ్యాప్ లేకుండా తన 68వ సినిమా షూటింగ్ మొదలు పెట్టేశాడు. ప్రస్తుతం చిత్రబృందం రవితేజతో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈనెల ఫస్ట్ నుండి షూటింగ్ ప్రారంభిస్తున్నట్టు చిత్రయూనిట్ తెలపడమే కాకుండా ప్రీ లుక్ ను సైతం రిలీజ్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రీ లుక్ లో రవితేజ కుర్చీపై కూర్చోని ఉండడం, అది ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం అని బోర్డు చూపించడంతో రవితేజ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నట్టు అర్థమైంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈసినిమాలో రవితేజ నిజాయితీగల ఎమ్మార్వో పాత్ర పోషిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నిజాయితీగా ఉండటానికి ఎంత దూరమైన వెళ్లే ఉద్యోగస్తుడిగా రవితేజ పాత్ర ఉండబోతున్నట్టు తెలుస్తుంది.
కాగా ఈసినిమాను కూడా యధార్థ సంఘటన ఆధారంగానే శరత్ మండవ తెరకెక్కించబోతున్నాడట. ‘మజిలీ’ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో నాజర్, నరేష్, పవిత్ర లోకేష్, రాహుల్ రామకృష్ణ సహాయక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్, ఎల్‌ఎల్‌పి బ్యానర్ లపై నిర్మితమవుతున్న ఈ సినిమాకు సామ్ సిఎస్ సంగీతం అందిస్తుండగా..సినిమాటోగ్రాఫర్ గా సత్యన్ సూర్యన్ పనిచేస్తున్నాడు
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: