డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ లో అలియా భట్ , ఒలీవియా మోరిస్ కథానాయికలు. అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“రౌద్రం రణం రుధిరం ” మూవీ షూటింగ్ హైదరాబాద్ లో పునః ప్రారంభం అయిన విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ షూటింగ్ లో జాయిన్ అయిన రెండు రోజులకు హీరో ఎన్టీఆర్ జాయిన్ అయ్యారు. “రౌద్రం రణం రుధిరం” మూవీ షూటింగ్ రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయిందని చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. తెలుగు, తమిళ భాషలకు సంబంధించిన డబ్బింగ్‌ను హీరోలిద్దరూ పూర్తి చేశారని తెలిపింది. అక్టోబర్ 13న విజయదశమి సందర్భంగా, కరోనా పరిస్థితులకు అనుగుణంగా సినిమా విడుదలకు సిద్ధమవుతోందని తెలిపింది. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రబృందం తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో బైక్ పై ప్రయాణిస్తున్న హీరోలు ఇద్దరూ హెల్మెట్స్ ధరించలేదు. బైక్ ప్రయాణం చేస్తున్నప్పుడు హెల్మెట్ తప్పనిసరి కదా! దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
ఆపోస్టర్ లో ఉన్న హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌కు హెల్మెట్స్ జోడించి మరో పోస్టర్ రిలీజ్ చేశారు. ‘‘ఇప్పుడు పర్‌ఫెక్ట్‌గా ఉంది. హెల్మెట్ ధరించండి… సురక్షితంగా ఉండండి’’ అంటూ పోలీసులు ట్వీట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: