అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి సినిమా అల్లరి నే తన ఇంటి పేరుగా మార్చుకొని అతి తక్కువ టైమ్ లోనే 50కి పైగా సినిమాలు తీశాడు. ఈ జనరేషన్ లో ఉన్న కామెడీ హీరోగా తన ప్రత్యేకమైన మార్క్ ను వేశాడు. ఇక ఇటీవలే నాంది సినిమాతో మరోసారి తన నటనతో ఆకట్టుకున్న అల్లరి నరేష్ ఇప్పుడు మరో డిఫరెంట్ స్టోరీతో వచ్చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ రోజు అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా తన కొత్త చిత్రానికి సంబంధించిన టైటిల్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. టైటిల్‌కు తగ్గట్లుగానే పోస్టర్‌లో కూడా సభకు నమస్కారం చేస్తూ కనిపిస్తున్నాడు అల్లరి నరేష్. అంతేకాకుండా వెనక జేబులో డబ్బు, మద్యం పెట్టుకోవడం చూస్తుంటే ఏదైనా పొలిటికల్ సెటైరికల్ సినిమాలాగ అనిపిస్తుంది. పోస్టర్ చూస్తుంటే ఈ సారి కూడా అల్లరి నరేష్ డిఫరెంట్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు అర్థమవుతోంది.
Wishing our @allarinaresh Garu a very happy birthday. Happy to associate with #Naresh58 as #SabhakuNamaskaram .. a hilarious entertainer with a difference, to be directed by @MallampatiSate1 with dialogues by @abburiravi Garu. #HBDAllariNaresh pic.twitter.com/vdmdbRIrmA
— Mahesh Koneru (@smkoneru) June 30, 2021
కాగా ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మల్లంపాటి సతీష్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అబ్బూరి రవి సంభాషణలు సమకూరుస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఈసినిమాలో నటించే నటీనటులు తదితర విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: