ప్రస్తుతం వెంకీ చేతిలో మూడు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో నారప్ప, దృశ్యం2 సినిమాలు ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకుంటున్నాయి. నారప్ప తమిళ్ లో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమా రీమేక్ కాగా.. మరొకటి మలయాళం లో సూపర్ హిట్ అయిన దృశ్యం2 రీమేక్. ఇక థియేటర్స్ ఏలాగూ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి త్వరలోనే రిలీజ్ డేట్స్ ప్రకటిస్తారని అందరూ అనుకుంటున్నారు. ఈ గ్యాప్ లోనే షాకింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. చిత్రాలను ఓటిటిలో విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారట మేకర్స్. త్వరలోనే ఈసినిమాల విడుదల విషయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు. మరి ఇది వెంకీ అభిమానులకు కాస్త నిరాశ పరిచే వార్త అనే చెప్పాలి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఈవార్త అయితే ప్రస్తుతం వైరల్ అవుతుంది. చూద్దాం దీనిపై అధికారిక ప్రకటన ఏదైనా ఇస్తారేమో చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ప్రియమణి ఈ సినిమాలో సుందరమ్మగా నటిస్తుంది. కేరాఫ్ కంచరపాలెం ఫేం కార్తీక్ రత్నం కీలక పాత్రలో నటిస్తున్నాడు. నారప్ప పెద్ద కొడుకు మునికన్నా పాత్రలో కార్తీక్ రత్నం నటిస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. జీతూజోసఫ్ దర్శకత్వంలో వెంకీ-మీనా ప్రధాన పాత్రల్లోనే దృశ్యం 2 రీమేక్ వస్తుంది.
ఇక ఈరెండు సినిమాలతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 సినిమా రీమేక్ చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ కూడా కరోనా వల్ల బ్రేక్ పడింది. త్వరలోనే ఈసినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టనున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: