ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరైన కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఇప్పుడు ఒక గ్యాంగ్ స్టర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీ సిద్దేశ్వర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఆర్ చంద్రు దర్శకత్వంలో ఉపేంద్ర కథానాయకుడిగా భారీ బడ్జెట్ తో “కబ్జా “కన్నడ మూవీ తెరకెక్కుతుంది. హీరో ఉపేంద్ర అండర్ వరల్డ్ డాన్ గా నటిస్తున్న ఈ మూవీ లో మరో కన్నడ సూపర్ స్టార్ సుదీప్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కన్నడ , తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “కబ్జా ” మూవీ 7 భాషలలో రిలీజ్ కానుంది. మలయాళ , హిందీ , మరాఠి , బెంగాలీ భాషలలో డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న “కబ్జా ” మూవీ లో సుదీప్ పాత్ర కొత్తగా , ఆసక్తిగా ఉంటుందని సమాచారం. చిత్ర యూనిట్ ఉపేంద్ర , సుదీప్ లుక్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. “ముకుందా మురారి “మూవీ తో ప్రేక్షకులను అలరించిన ఉపేంద్ర , సుదీప్ మరో సారి “కబ్జా ” మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: