మలయాళ, తమిళ చిత్ర పరిశ్రమల కు నివేద థామస్ చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యారు. పలు మలయాళ , తమిళ మూవీస్ లో కథానాయికగా నటించిన నివేద సూపర్ హిట్ “జంటిల్ మన్ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “నిన్నుకోరి”, “జై లవ కుశ “, “118 “, “బ్రోచేవారెవరురా”, “వకీల్ సాబ్” వంటి సూపర్ హిట్ మూవీస్ లో నివేద తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నివేద ప్రస్తుతం “శాకినీ -ఢాకినీ “మూవీ లో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక ఇంటర్వ్యూ లో నివేద మాట్లాడుతూ .. తనకి డైరెక్షన్ అంటే ఇష్టమనీ, డైరెక్షన్ కి సంబంధించిన కోర్స్ ను కూడా పూర్తిచేశాననీ, త్వరలోనే మెగా ఫోన్ పడతాననీ చెప్పారు. సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు అందరినీ పలుకరించే నివేదా థామస్ ఇప్పుడు రెడ్ శారీ ధరించిన ఫొటోలను సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఆ ఫొటోలు అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: