తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ యాక్టింగ్ తోపాటు సింగింగ్ లోకూడా ఇరగదీస్తాడని తెలిసిందే. విజయ్ తో తన సినిమాల్లో ఒక్క సాంగ్ అయినా పాడిస్తుంటారు సంగీత దర్శకులు.అవన్నీ చార్ట్ బాస్టర్ అయ్యాయి.అయితే ఈసారి ఒక్క సాంగ్ తో ఆపలేదు విజయ్. ఏకంగా రెండు పాటలు పాడాడు.విజయ్ ప్రస్తుతం ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) అనే సినిమా చేస్తున్నాడు.నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.జూన్ లోపు కంప్లీట్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా కోసం విజయ్ రెండు పాటలు పాడాడు.అందులో విజిల్ పోడు సాంగ్ రిలీజ్ కూడా అయ్యింది.ఈసాంగ్ సౌత్ లో 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ను సాధించిన సాంగ్ గా రికార్డు సృష్టించింది. త్వరలోనే రెండో పాటకు బయటికి రానుంది.అంతేకాదు విజయ్ బర్త్ డే కు టీజర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో సీనియర్ హీరో ప్రశాంత్ , ప్రభుదేవా ,అజ్మల్, లైలా ,మీనాక్షి చౌదరీ,యోగిబాబు వీటీవీ గణేష్, జయరామ్ , స్నేహ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























