సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పుష్ప2 సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. పుష్ప దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టించడంతో అల్లు అర్జన్ క్రేజ్ కూడా దేశవ్యాప్తంగా పెరిగింది. ఇప్పటికే పార్ట్ 1 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా.. ఈ సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమాతోనే బన్నీ కి నేషనల్ అవార్డ్ తో పాటు పలు అవార్డులు కూడా దక్కాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసే పనిలో ఉంది. మరోవైపు ఈ సినిమా నుండి ఏ అప్ డేట్స్ వచ్చినా ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయో చూస్తున్నాం. దాన్ని బట్టి ఈసినిమాపై క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక పుష్ప పాటలు ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆదరణ పొందాయో చూశాం. దీంతో పార్ట్ 2 పాటలపై కూడా అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ పుష్ప పుష్ప సాంగ్ సోషల్ మీడియాలో రికార్డ్ స్థాయిలో వ్యూస్ ను సొంతంచేసుకుంది. ఇప్పుడు సెకండ్ సాంగ్ కు సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది. ఈ మేరకు చిత్రయూనిట్ ఒక క్యూట్ వీడియోను రిలీజ్ చేసింది. వీడియోలో సాంగ్ సెట్ లో రష్మిక మేకప్ వేసుకుంటుంటే కేశవ వచ్చి.. శ్రీవల్లి వదిన పుష్ప 2 నుంచి రెండో పాట రిలీజ్ చేస్తున్నారంట కదా ఆ పాటేందో చెప్తావా అని అడగ్గా రష్మిక.. సూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి అంటూ పాటకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చింది. ఫుల్ సాంగ్ ను మే 29వ తేదీన ఉదయం 11 గంటల 7 నిమిషాలకు ఈపాటను రిలీజ్ చేయనున్నారు.
కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుంది. జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























