లవ్ మీ మూవీ తెలుగు రివ్యూ

ashish reddy love me movie telugu review

అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఆశిష్ రెడ్డి, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా లవ్ మీ. హార్రర లవ్ స్టోరీ నేపథ్యంలో రూపొందించిన ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. దానికి తోడు వచ్చిన అప్ డేట్లు అన్నీ సినిమాపై మరింత బజ్ ను క్రియేట్ చేశాయి. మరి ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ అంచనాలను ఈసినిమా ఏమేరకు రీచ్ అయ్యింది.. ఎంతవరకూ విజయాన్ని అందించింది లాంటి విషయాలు తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. ఆశిష్ రెడ్డి, వైష్ణవి చైతన్య,ఆశిష్ రెడ్డి, వైష్ణవి చైతన్య, సిమ్రాన్ చౌదరి, రవి కృష్ణ, రాజీవ్ కనకాల, తదితరులు
దర్శకత్వం.. అరుణ్ భీమవరపు
బ్యానర్స్..దిల్ రాజు ప్రొడక్షన్స్
నిర్మాతలు.. హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి
సంగీతం.. ఎం.ఎం కీరవాణి
సినిమాటోగ్రఫి.. పి.సి.శ్రీరామ్

కథ
అర్జున్(ఆశిష్), ప్రతాప్(రవికృష్ణ) ఇద్దరూ యూట్యూబ్ ఛానల్ నడిపిస్తుంటారు. దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. మరోవైపు ప్రియ (వైష్ణవి చైతన్య) కూడా వారితో కలిసి పనిచేస్తుంటుంది. ఈక్రమంలో అర్జున్ కు ఒక గ్రామంలో జరిగిన సంఘటన గురించి తెలుస్తుంది. ఆగ్రామంలోని ఒక కుటుంబంలో తల్లి, తండ్రి చనిపోగా వారి పాప బ్రతికే ఉందని.. అయితే ఆపాప పెద్దయి దివ్వవతి అనే దెయ్యంగా మారుతుందని వింటాడు. దీంతో అర్జున్ అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అనుకున్నట్టే అక్కడికే వెళ్లి ఆ దివ్వవతి కథ తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈక్రమంలో దెయ్యంతో ప్రేమలో పడటమే కాకుండా తన రీసెర్చ్ లో మరో ముగ్గురు అమ్మాయిలు కూడా అక్కడ చనిపోయినట్టు తెలుసుకుంటాడు. మరి అసలు దివ్యవతి ఎవరు? ఆ పాప ఎవరు? ఆ ముగ్గురు అమ్మాయిలు ఎవరు? ఎలా చనిపోయారు? అర్జున్ దయ్యాన్ని ఎందుకు ప్రేమించాడు? అన్నదే ఈసినిమా కథ..

విశ్లేషణ

హార్రర్ జోనర్లు ఆడియన్స్ కు ఎప్పుడూ ఇంట్రెస్టింగానే ఉంటాయి. కథలో సస్పెన్స్ ఎలిమెంట్స్, ట్విస్ట్ లు ఆద్యంత అలరించేలా ఉంటే చాలు సినిమా హిట్టే. ఇప్పుడు అలాంటి జోనర్లో వచ్చిందే లవ్ మీ. అయితే హారర్ర కు లవ్ స్టోరీనీ జోడించి కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేసారు. టీజర్, ట్రైలర్ లను బట్టి ఏ పని అయితే చేయొద్దని అంటారో ఆ పనే చేసే ఒక యువకుడు ఆఖరికి దెయ్యాన్నే ప్రేమిస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్టెతో వచ్చారని అర్థమవుతుంది. అంతేకాదు సినిమా ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. ఆశిష్ అయితే ఈసినిమాతో సింగిల్ స్క్రీన్స్ మళ్లీ కళకళలాడతాయని కూడా చెప్పాడు. మరి ఈసినిమా ఎంతవరకూ ఆకట్టుకుందో చూద్దాం..

అరుణ్ భీమవరపు ఒక మంచి పాయింట్ తో వచ్చాడని చెప్పొచ్చు. తను నవల రచయిత అని చెప్పినట్టుగానే సినిమాలో స్క్రీన్ ప్లే కూడా అలానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా అర్జున్ గురించి, అర్జున్ దివ్యవతి గురించి వెతుకుతూ వెళ్లడం, అక్కడ దెయ్యంతో సీన్స్ సాగి ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చాడు. ఇక సెకండ్ హాఫ్ లో ఆ ముగ్గురు అమ్మాయిల గురించి, దివ్యవతి గురించి అర్జున్ చేసే రీసెర్చ్ ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి ఒక్కో ట్విస్ట్ రివీల్ కథపై మరింత ఆసక్తి కలిగించాడు డైరెక్టర్. దర్శకుడిగా అరుణ్ మొదటి సినిమాతో సక్సెస్ అయ్యాడని చూపొచ్చు.

పెర్ఫామెన్స్
ఇక నటీనటులు పెర్ఫామెన్స్ విషయానికి వస్తే అర్జున్ పాత్రలో ఆశిష్ ఈసినిమాలో కూడా బాగానే నటించాడు. అయితే ఈసినిమాలో కాస్త సీరియస్ గా మూడీగా ఉండే పాత్రలో సెటిల్డ్ పెర్ఫామెన్స్ చేశాడు. ముందు సినిమాలతో పోల్చుకుంటే ఈసినిమాలో ఇంకా ఈజ్ తో నటించాడు. లుక్ వైస్ గా మాత్రం స్టైలిష్ లుక్ మేకోవర్ తో బాగున్నాడు. ఇక వైష్ణవి చైతన్య ప్రియ పాత్రలో నటించింది. ఈసినిమాలో కూడా మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. కొన్ని సన్నివేశాల్లో తన నటనతో మరోసారి మంచి నటి అన్న భావనను కలిగిస్తుంది. విరూపాక్ష సినిమా తరువాత రవికృష్ణకు ఈసినిమాలో కూడా మంచి రోల్ దక్కింది. ఆశిష్ కు సపోర్టివ్ గా ఉండే పాత్రలో బాగానే నటించాడు. ఈసినిమాలో మరో ప్రధానమైన పాత్ర సిమ్రాన్ చౌదరిది. స్కెలెటిన్ స్పెషలిస్ట్ గా ఆమె కూడా ఓకే అనిపించింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల మేర బాగానే నటించారు.

టెక్నికల్ వాల్యూస్
ఇలాంటి సినిమాలు సాంకేతిక విభాగం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా సంగీతం, సినిమాటోగ్రఫి. మరి సంగీతం, సినిమాటోగ్రఫి ఎవరు అందించారో తెలిసిందే. ఎం.ఎం కీరవాణి అందించిన సంగీతం చాలా బాగా ఆకట్టుకుంది. రిలీజ్ కు ముందే పాటలు మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా.. రిలీజ్ తరువాత సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత ఆకట్టుకుంది. మరోవైపు పీసీ శ్రీరామ్ అందించిన విజువల్స్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దిల్ రాజు ప్రొడక్షన్స్ కాబట్టి నిర్మాణ విలువలు రిచ్ గానే ఉన్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే హార్రర్ జోనర్ సినిమాలు ఇష్టపడే వారికి ఈసినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. అంతేకాదు మిగిలిన వర్గాల వారు కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేసే సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.